Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ కు 'సైరా' టెన్షన్..మామూలుగా లేదు

అమెజాన్ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నిర్మాతలకు బంగారు బాతుగా మారిన సంగతి తెలిసిందే. నిర్మాతలు... తమ సినిమా బడ్జెట్ లెక్కలేసుకున్నప్పుడే అమెజాన్ ఎంత వస్తుందో లెక్కలు వేసేసి, దాన్ని బట్టి బిజినెస్ అంచనాలు వేస్తున్నారు. దాంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Amazon hoping on Chiranjeevi's Syeraa movie
Author
Hyderabad, First Published Nov 24, 2019, 2:00 PM IST

అమెజాన్ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ నిర్మాతలకు బంగారు బాతుగా మారిన సంగతి తెలిసిందే. నిర్మాతలు... తమ సినిమా బడ్జెట్ లెక్కలేసుకున్నప్పుడే అమెజాన్ ఎంత వస్తుందో లెక్కలు వేసేసి, దాన్ని బట్టి బిజినెస్ అంచనాలు వేస్తున్నారు. దాంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఇప్పుడా పరిస్దితి మారుతున్నట్లు కనిపిస్తోంది. చిరు సైరా, ప్రభాస్ సాహో ఎఫెక్ట్ తో లుగులో అమెజాన్  జోరు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా ఈ సినిమాలు కొన్నా అందుకు తగ్గ రెవిన్యూలు రావటం లేదంటున్నారు. ఇప్పుడు ట్రేడ్ దృష్టి సైరా వ్యూయర్ షిప్ మీద ఉంది.

సైరా చిత్రం కొనటంతో అమెజాన్ మరో రిస్క్ చేసింది. భారీ మొత్తానికి సైరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేయటంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో అమెజాన్ లో ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందో అనే భయం పట్టుకుంది.  అమెజాన్ వాళ్లు  టెన్షన్ పడ్డానికి ప్రధాన కారణం సాహో సినిమా.

ప్రభాస్ హీరోగా  నటించిన  భారీ సినిమా సాహో ను భారీ మొత్తానికి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ. సినిమా తెలుగులో వర్కవుట్ కాకపోయినా... , అమెజాన్ లో హిట్ అవుతుందని అంతా అనుకున్నారు.అయితే సీన్ రివర్స్ అయ్యింది.  అమెజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో  ఎక్సపెక్ట్ చేసిన  స్థాయిలో సాహోకు రెస్పాన్స్ రాలేదు.  వ్యూయర్ షిప్ పెద్దగా రాలేదు.

ఈ నేపధ్యంలో  సైరాకు రిజల్ట్ ఏంటనేది టెన్షన్  పట్టుకుంది. దాదాపు 50 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కుంది అమెజాన్. రీసెంట్ గా స్ట్రీమింగ్ మొదలెట్టింది. వీకెండ్ కాబట్టి నిన్న, ఈ రోజు సైరాను ఫ్యామిలీలు చాలామంది చూస్తారని అమెజాన్ అంచనా వేసింది. యాభై  కోట్లు పెట్టి కొన్న సినిమాను ఆ స్థాయిలో వ్యూస్ రాకపోతే కష్టమే.  అది ఖచ్చితంగా తదుపరి పెద్ద సినిమాల బిజినెస్ పై పడుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios