ప్రశాంత్ కెప్టెన్సీని పీకేసిన బిగ్ బాస్.. అశ్విని మీద పడి అటాక్ చేసిన అమర్ దీప్
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం రోజు ఐదుగురు కొత్త సభ్యులు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మరోసారి హౌస్ నిండుగా కలర్ ఫుల్ గా మారింది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం రోజు ఐదుగురు కొత్త సభ్యులు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో మరోసారి హౌస్ నిండుగా కలర్ ఫుల్ గా మారింది. అయితే నేటి ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఇంటిని , ఇంటి సభ్యులని సరిగ్గా మేనేజ్ చేయడం లేదని, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడం లేదని బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీని పీకేశారు. అయితే అతడికి ఇమ్యూనిటీ మాత్రం కొనసాగుతుంది అని తెలిపారు. కెప్టెన్సీ పోవడంతో ప్రశాంత్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు.
ఈ వ్యవహారం లో శివాజీ ప్రశాంత్ కి అండగా నిలిచారు. ప్రశాంత్ ని హౌస్ లో అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారని పేర్కొన్నాడు. అనంతరం బిగ్ బాస్ కలర్స్ తో హౌస్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళు టీమ్స్ కి టాస్క్ పెట్టారు. ఈ పోటీలో ఇరు టీమ్స్ నుంచి ఒక్కో సభ్యుడు రావాలి. కలర్ కలర్ వాట్ కలర్ యు వాంట్ అని బిగ్ బాస్ ని అడుగుతారు. దీనితో బిగ్ బాస్ తనకి కావలసిన కలర్ చెబుతారు.
వెంటనే ఆ ఇద్దరూ వెళ్లి హౌస్ లో ఉన్న ఆ కలర్ వస్తువుని లైన్ అవతల వేయాలి. ఎవరు ముందుగా వస్తువు తీసుకువస్తే వాళ్లే విజేత. ఈ టాస్క్ లో భాగంగా అమర్ దీప్, అశ్విని పోటీ పడ్డ సమయంలో గందరగోళం నెలకొంది. అమర్ దీప్ అశ్విని మీద పడి ఆమె వస్తువుని లాక్కునే ప్రయత్నం చేశాడు. దీనితో బిగ్ బాస్ అతడిని మందలించారు. ఈ మొత్తం టాస్క్ లో ఆటగాళ్లు టీం విజయం సాధించింది.
అనంతరం బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అర్జున్, యావర్ పాల్గొన్నారు. ఇరువైపులా ఉన్న రాకెట్స్ ని కింద పడిపోకుండా పట్టుకోవాలి. ఈ టాస్క్ లో అర్జున్ ఎక్కువ సేపు రాకెట్స్ ని హోల్డ్ చేసి విజయం సాధించాడు.