రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో తిరిగి మళ్లీ పూర్వవైభవాన్ని పొందుతాడా..? అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ దానికోసం చేయాల్సినంత చేస్తున్నాడు ఈ దర్శకుడు. టైటిల్ గా దశాబ్దాల క్రితం హిట్ అయిన టైటిల్ ని వాడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.

అయితే ఇదేదో సినిమా స్టైల్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సినిమా స్టిల్ కాకుండా కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటనేది మాత్రం అర్ధం కాకుండా ఉంది. టైటిల్ లోగోతో పాటు ఈ పోస్టర్ లో కొన్ని ఆసక్తికర ఎలిమెంట్స్ ఉన్నాయి. త్రిభుజాకారం డిజైన్, ఒక మ్యాజికల్ రింగ్, రాజు రాణి బొమ్మలు ఉండడంతో పాటు రిటర్న్ గిఫ్ట్ అని రాసి ఉంది.

ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటనేది మాత్రం దర్శకుడు తన సినిమా ద్వారా చెబుతానంటున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి శ్రీనువైట్ల అనుకున్న ప్రకారం టైమ్ కి సినిమాను విడుదల చేస్తాడేమో చూడాలి!