కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీనువైట్ల. స్టార్ హీరోలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ సన్నివేశాలని కొన్ని సార్లు బాగా రిచ్ గా ప్లాన్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు ట్రైలర్ టాక్: అమర్ అక్బర్ ఆంటోని విషయంలో మాత్రం కొంచెం కొత్త స్టైల్ ని వాడినట్లు అనిపిస్తోంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 

శనివారం గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడంతో సినిమాకు కాస్త బజ్ పెరిగిందని చెప్పవచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ప్రపంచంలో శక్తి  చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్లు కొందరుంటే శక్తి మేరకు నయవంచన చేసేవాళ్లు కోకొల్లలు`` అంటూ శ్రీను వైట్ల వాయిస్ ఓవర్ తో మొదలవ్వడం బావుంది. ఇక రవితేజ చెప్పిన డైలాగ్  ``దిస్ ఈజ్ నాట్ ఏ రివెంజ్.. దిస్ ఈజ్ రిటన్ గిఫ్ట్`` కూడా ఆకట్టుకుంటోంది. 

నయా వంచకులను వేటాడటానికి మాస్ రాజా ఎలాంటి దారిలో నడిచాడనే పాయింట్ బాగానే ఉన్నా రెగ్యులర్ గా అనిపిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. మూడు విభిన్నమైన పాత్రల్లో రవితేజ పాత్ర అయితే ఆసక్తిని రేపుతోంది. అయితే కామెడీ సన్నివేశాలు రోటిన్ గానే ఉన్నట్లు అర్ధమవుతోంది. 

సునీల్ - వెన్నల కిషోర్ వంటి వాళ్ళు కనిపిస్తుండడం ప్లస్ పాయింట్. సినిమా స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఆసక్తిని కలిగిస్తే తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పవచ్చు. మరి శ్రీను వైట్ల - మాస్ రాజా కాంబినేషన్ లో వస్తోన్న నాలుగవ సినిమా అమర్ అక్బర్ అంథోని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది.