భార్య పాత్రలకు బ్రాండ్ అంబాసడర్ అంటే ఆమనీ నే. 90లలో ఆమె నటించిన ఫ్యామిలీ చిత్రాలు భారీ విజయాలు అందుకున్నాయి. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు వంటి హీరోలకు భార్యగా చేసిన ఆమనీ, హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమెని తల్లి పాత్రలకు షిఫ్ట్ అయ్యారు. తాజాగా శర్వానంద్ హీరోగా విడుదలైన శ్రీకారం మూవీలో ఆమె శర్వా తల్లిపాత్ర చేయడం జరిగింది. 


కాగా వచ్చే వారం కార్తికేయ హీరోగా తెరకెక్కిన చావు కబురు చల్లగా మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో కూడా ఆమనీ హీరో తల్లిపాత్ర చేశారు. చావు కబురు చల్లగా మూవీలో ఆమనీ పాత్ర ఊర మాస్ గా ఉంటుందట. గంగమ్మ అనే పాత్రలో ఆమె ఫుల్ గా మందు కూడా కొడుతుందని సమాచారం. విడుదలైన చావు కబురు చల్లగా పోస్టర్స్ లో వంట చేస్తున్న ఆమనీ పక్కన క్వార్టర్ బాటిల్ ఉండగా, ఆమె గ్లాసు ఎత్తిపట్టుకు తాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ఆమనీ... తాగుబోతు అమ్మ పాత్రలో  ఏ రేంజ్ లో  రెచ్చిపోనున్నారో చూడాలి. 

హీరో కార్తికేయ సైతం ఈ చిత్రంలో మాస్ రోల్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి కౌశిక్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. మార్చి 19న చావు కబురు చల్లగా విడుదల కానుంది.