అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.

అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. ఆమె యాటిట్యూడ్ లో కూడా మార్పు వచ్చింది. అందుకు కారణం అమలాపాల్ తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులే.

'ఆమె' చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా నటించి సరికొత్త సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అమలాపాల్ లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా అమలాపాల్ కి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వస్తున్న తరుణంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్లకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. 

అప్పటి నుంచి అమలాపాల్ సింగిల్ గా ఉంటోంది. ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించినప్పుడు ఫాన్స్ ఆమెని సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నించారు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి. తాను పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని.. తనని తాను ఆవిష్కరించుకునే పనిలో ఉన్నానని అమలాపాల్ తెలిపింది. 

ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచన మొదలు పెడతానని.. అప్పుడే మీరడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తానని అమలాపాల్ పేర్కొంది. త్వరలోనే దీని గురించి క్లారిటీ తెచ్చుకుంటాను అమలాపాల్ ఫ్యాన్స్ కి తెలిపింది. అమలాపాల్ తన మ్యారేజ్ గురించి కాస్త పాజిటివ్ గా స్పందించడంతో.. ఈమెకు సెకండ్ మేరేజ్ చేసుకునే ఆలోచన ఉందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.