కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది అమలాపాల్. ఈ సినిమా ట్రైలర్, టీజర్ లలో అమలాపాల్ నగ్నంగా కనిపించింది. 

అంతేకాదు.. తన సహనటి వీజే రమ్యని ముద్దుపెట్టుకుంటూ మరో సన్నివేశంలో కనిపించింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమలాపాల్ బోల్డ్ పెర్ఫార్మన్స్ హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఈ ముద్దు సన్నివేశంపై స్పందించింది అమలాపాల్. ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడంలో తప్పేంటి..? అని ప్రశ్నించింది. సినిమాలో ఆ షాట్ అనుకోకుండా వచ్చిందని, స్క్రిప్ట్ లో లేదని చెప్పింది. ఓసారి పాత్రలో లీనమైతే.. ఇక మన స్వభావాన్ని పక్కన పెట్టినట్లేనని.. ఈ సినిమా శృంగారం నేపధ్యంలో సాగే కథ కాదని.. సినిమా కంటెంట్ అర్ధం చేసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని అంటోంది.

ఈ సినిమా నటిగా తనకు ఇంకాస్త నమ్మకం, బలం ఇచ్చిందని చెప్పింది. మొదట్లో ఆ సన్నివేశాల్లో ఎలా నటించాలని ఆలోచించానని.. కానీ కెమెరా ముందుకు వెళ్లిన తరువాత 
సౌకర్యంగానే ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు తనకు ఈ ప్రపంచంలో ఎలాంటి సవాలునైనా.. ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని వెల్లడించింది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నగ్న సన్నివేశాల గురించి తన తల్లికి చెప్పినట్లు.. అలాంటి సీన్లు స్క్రిప్ట్ కి అవసరమైతే కచ్చితంగా నటించమని చెప్పారని చెప్పుకొచ్చింది.