Asianet News TeluguAsianet News Telugu

విజ‌య్‌కాంత్‌ని హత్య చేసారంటూ స్టార్ డైరక్టర్ ఆరోపణ,అజిత్ ని కెలికారే

 విజ‌య్‌కాంత్ ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, ఆయ‌న్ని ఎవ‌రో హ‌త్య చేశార‌ని మలయాళ స్టార్ డైరక్టర్  అల్ఫోన్స్ పుత్రేన్ (ప్రేమమ్ ఫేమ్) ఆరోపించ‌డం షాక్ ఇస్తోంది.  

Alphonse Puthren Instagram posts allege Vijayakanth was murdered jsp
Author
First Published Dec 29, 2023, 7:46 AM IST


ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ గురువారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించింది. కరోనా కూడా సోకడంతో.. వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పోరాడుతూ 71 ఏళ్ల వయసులోనూ ఆయన తుదిశ్వాస విడిచారు.  విజయకాంత్ మరణం ఆయ‌న అభిమానుల్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. 

అయితే విజ‌య్‌కాంత్ ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, ఆయ‌న్ని ఎవ‌రో హ‌త్య చేశార‌ని మలయాళ స్టార్ డైరక్టర్  అల్ఫోన్స్ పుత్రేన్ (ప్రేమమ్ ఫేమ్) ఆరోపించ‌డం షాక్ ఇస్తోంది.  పుత్రేన్ లాంటి ద‌ర్శ‌కుడు ఇలా మాట్లాడ‌డం త‌మిళ నాట చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ని ట్యాగ్ చేస్తూ ఓ పెద్ద పోస్ట్ పెట్టారు పుత్రేన్‌. ఆ పోస్ట్ లో ఏముంది అంటే...

''ఉదయనిధి స్టాలిన్ అన్నా... కేరళ నుంచి చెన్నై వచ్చిన నేను, రెడ్ జెయింట్ ఆఫీసులో కూర్చుని 'మీరు రాజకీయాలలోకి రావాలి' అని చెప్పాను. కలైంజర్ (కరుణానిధి)ని ఎవరు మర్డర్ చేశారో, ఐరన్ లేడీ జయలలితను మర్డర్ చేసింది ఎవరో మీరు కనిపెట్టాలని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్ (Captain Vijayakanth)ను ఎవరు హత్య చేశారో కనిపెట్టాలి. వాళ్ళను పట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని విస్మరిస్తే... 'ఇండియన్ 2' సెట్స్‌లో కమల్ హాసన్ గారిని, మిమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు. మీరు గనుక ఆ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే... మిమ్మల్ని లేదా స్టాలిన్ (ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి) స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తారు. 'నీరం' సినిమా విజయవంతమైన తర్వాత మీరు నాకు ఓ బహుమతి ఇచ్చారు... గుర్తుందా? ఐ ఫోన్ సెంటర్‌కు కాల్ చేసి 15 నిమిషాల్లో ఐ ఫోన్ బ్లాక్ కలర్ ఫోన్ తెప్పించి నాకు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ అన్నా... మీకు అది గుర్తు ఉంటుందని అనుకుంటున్నా. మర్డర్స్ చేసిన వాళ్ళను పట్టుకుని వాళ్ళ మోటివ్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఐ ఫోన్ తెప్పించడం కంటే సింపుల్'' అని అల్ఫోన్స్ పేర్కొన్నారు.  ఈ  వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

ఇదిలా ఉంటే..అజిత్ ని ఉద్దేసిస్తూ అదే సమయంలో ఈ డైరక్టర్ పోస్ట్ పెట్టారు.  ''అజిత్ కుమార్ సార్... మీరు రాజకీయాల్లోకి వస్తారని నాకు నివిన్ పౌలీ, సురేష్ చంద్ర చెప్పారు. మీ అమ్మాయి అనౌష్కకు 'ప్రేమమ్' సినిమా నచ్చడంతో నివిన్ పౌలీని మీ ఇంటికి పిలిచిన తర్వాత ఆ మాట విన్నాను. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకని? మీరు అబద్ధం చెప్పారా? లేదంటే మర్చిపోయారా? లేదంటే మీకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తున్నారా? ఒకవేళ ఆ మూడు కాదంటే అసలు కారణం ఏమిటి? నాకు తెలియాలి. ఎందుకంటే... మీపై నాకు నమ్మకం ఉంది. ప్రజలకు కూడా నమ్మకం ఉంది'' అని మరో పోస్ట్ చేశారు అల్ఫోన్స్.

ఇక విజయ్ కాంత్ ‘ఇనిక్కుం ఇలామై’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎక్కువగా ఆయన తన సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించారు. విజయకాంత్‌ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలవడం ఆరంభించారు. విజయ్ కాంత్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దీంతో విజయ్ కాంత్‌కు తెలుగునాట కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల దిశగా తన ప్రస్థానం సాగించారు. విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని విజయ్ కాంత్ స్థాపించారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios