హెల్త్ ఇష్యూ... సినిమాలకు గుడ్ బై.. 'ప్రేమమ్' డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం
నిజానికి సినిమాలను ఆపేయాలని అనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేదు. నేను చేయలేని పని గురించి ప్రామిస్ లు చేయలేను.

ప్రేమమ్ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. తెలుగులో కన్నా ముందుగా మళయాళంలో వచ్చింది. అక్కడ కుర్రాళ్లను ఊపేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకుంది. నివీన్ పౌలి, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ చిత్రం దర్శకుడు ఇప్పుడు రిటైర్టెంట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ ఫీల్ గుడ్ మూవీ గా అద్భుతంగా తెరకెక్కించారు . ప్రేమన్ డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ మధ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంతకు ముందుకు ఇప్పటికీ అసలు గుర్తు పట్టలేనంతగా మారారు.
అల్ఫోన్స్ సోషల్ మీడియాలో స్వయంగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆ పోస్ట్ ని డిలేట్ చేసేసారు. కానీ అప్పటికే వైరల్ అయ్యిపోయింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు చాలా బాధ పడుతున్నారు.
" నేను నా సినిమా థియేటర్ కెరీర్ ను ఆపేస్తున్నాను. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండాలనుకోవడం లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ వరకు మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ చేస్తాను. నిజానికి సినిమాలను ఆపేయాలని అనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేదు. నేను చేయలేని పని గురించి ప్రామిస్ లు చేయలేను. ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా ఎదురవుతుంది" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇక ఇదే ప్రేమమ్ సినిమాని మన తెలుగులో నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్ తో చందు మొండేటి రీమేక్ చేయగా ఇక్కడ కూడా 'ప్రేమమ్' సూపర్ హిట్ అందుకుంది. 'నేరమ్' అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు అల్ఫోన్స్. ఆ తర్వాత చేసిన 'ప్రేమమ్' చిత్రం దర్శకుడిగా ఆయనకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. గత ఏడాది నయనతార, పృథ్విరాజ్ సుకుమారన్ లతో గోల్డ్ తీశాడు. ఇది వర్కవుట్ కాలేదు.