Asianet News TeluguAsianet News Telugu

`అల్లు స్టూడియో` ఓపెనింగ్‌కి ముహూర్తం ఫిక్స్.. మెగాస్టార్‌ గెస్ట్ గా గ్రాండ్‌ లాంచ్‌..

ప్రముఖ దిగ్గజ హాస్య నటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థంలో `అల్లు స్టూడియో` నిర్మించిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనుంది.

allu studio opening date fix inaugurated by megastar chiranjeevi on occasion of allu ramalingaiah 100th birth anniversary
Author
First Published Sep 29, 2022, 3:38 PM IST

అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లో భారీగా సినిమాలకు సంబంధించిన స్టూడియోని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అది నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనుంది. ప్రముఖ దిగ్గజ హాస్య నటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థంలో `అల్లు స్టూడియో` నిర్మించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 1న అల్లు రామలింగయ్య వందవ జయంతి సందర్భంగా ఈ ప్రారంభోత్సవం జరగబోతుండటం విశేషం.  

గతేడాది అల్లూ రామలింగయ్య 99వ జయంతి సందర్బంగా అల్లు అరవింద్‌ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని గండిపేట్(కోకాపేట) సమీపంలో అల్లు స్టూడియోని నిర్మించబోతున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. అదే రోజు నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. సరిగ్గా ఏడాది వరకు స్టూడియో నిర్మాణ పనులు పూర్తి చేశారు. దాదాపు పది ఎకరాల్లో ఈస్టూడియో నిర్మాణం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సధుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఇందులో చేసుకునేలా ప్లాన్‌ చేశారు. 

ఈ స్టూడియోని నిర్మాత అల్లు అరవింద్‌ సారథ్యంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోపాటు ఆయన సోదరులు అల్లు బాబీ(వెంకటేష్‌), అల్లు శిరీష్‌లు కలిసి నిర్మించారు. షూటింగ్‌లకు సంబంధించిన బిల్డింగ్‌ పనులు పూర్తయ్యాయి. దీంతో షూటింగ్‌ లు చేసుకునేందుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రారంభకార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవితోపాటు అల్లు అరవింద్‌, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్‌, వారి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.

ఇప్పటికే షూటింగ్‌లకు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారధి స్టూడియో వంటి స్టూడియోలున్నాయి. వీటితోపాటు `అల్లు స్టూడియో` కూడా అందుబాటులోకి రానుంది. ఇది మోడ్రన్‌ టెక్నాలజీగా, మరింత మోడ్రన్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ ఈవెంట్‌ కోసం మెగా, అల్లు ఫ్యాన్స్ ఆసక్తికరంగా చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios