Asianet News TeluguAsianet News Telugu

ప్రీ లుక్‌తోనే షాక్‌ ఇస్తున్న అల్లు శిరీష్‌.. ఇక ఫస్ట్ లుక్‌ ఎలా ఉంటుందో?

వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు హీరో అల్లు శిరీష్. ఏబిసిడి అనే యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న శిరీష్ ఇప్పుడు త‌న అర‌వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. 

allu sirish upcomming movie pre look viral  arj
Author
Hyderabad, First Published May 27, 2021, 12:36 PM IST

ఇటీవల సిక్స్ ప్యాక్‌తో అందరిని ఆశ్చర్య పరిచిన బన్నీ బ్రదర్‌ అల్లు శిరీష్‌ ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించిన ప్రీ లుక్‌తో షాక్‌ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేశారు. హీరోయిన్‌తో ఇంటెన్స్ సీన్‌లో అదరగొట్టాడు. తాజాగా గురువారం ఈ లుక్‌ని పంచుకోగా అది తెగ వైరల్‌ అవుతుంది. 

వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు హీరో అల్లు శిరీష్. ఏబిసిడి అనే యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న శిరీష్ ఇప్పుడు త‌న అర‌వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అను ఇమానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది.

 మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 6ను విడుద‌ల చేయ‌నున్నాను. ఈ వివ‌రాల‌ను తెలుపుతూ విడుద‌ల చేసిన ప్రీ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లు శిరీష్, అనుఇమానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ పోయేటిక్ స్టిల్ తో ఈ ప్రీ లుక్ ని సిద్ధం చేసి విడుద‌ల చేశారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఈ ప్రీలుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రీలుక్ తో ఈ సినిమా పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు టీమ్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios