మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు శిరీష్ నటించిన చిత్రాల్లో శ్రీరస్తు శుభమస్తు మాత్రమే పరవాలేదనిపించింది. ప్రస్తుతం అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ఎబిసిడి. రాజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళీ చిత్రం ఎబిసిడికి ఇది రీమేక్. ఈ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడి పాత్రలో మాస్టర్ భరత్ నటిస్తున్నాడు. 

మే 17న ఎబిసిడి చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది. మే 13న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరగనుంది. నేచురల్ స్టార్ నాని ఎబిసిడి ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విట్టర్ లో ప్రకటించాడు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యేందుకు అంగీకరించిన నేచురల్ స్టార్ నానికి మా ఎబిసిడి చిత్ర యూనిట్ తరుపున కృతజ్ఞతలు అని అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ కామెడీ యాంగిల్ ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు శిరీష్, మాస్టర్ భరత్ కలసి బాగా అల్లరి చేసినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. రుక్సార్ థిల్లోన్ శిరీష్ కు జంటగా నటించింది.