సూర్య సినిమా నుండి మెగాహీరో అవుట్.. కారణమదేనా..?

allu sirish exits from surya, kv anand's project
Highlights

నిజానికి శిరీష్ తెలుగులో సంజీవ్ రెడ్డి సినిమా మాత్రమే కమిట్ అయ్యాడు. సూర్య సినిమా కోసం కొద్దిరోజులు షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుంది

తమిళంలో సూర్య హీరోగా దర్శకుడు కెవి ఆనంద్ ఓ సినిమా రూపొందించనున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరో కూడా నటిస్తుండడం విశేషం. అటువంటి సినిమాలో మెగాహీరో అల్లు శిరీష్ అవకాశం దక్కించుకున్నాడు. సినిమాలో కీలక పాత్ర కోసం అతడిని ఎంపిక చేసుకున్నారు. తన అభిమాన నటుడు సూర్యతో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందంటూ శిరీష్ గతంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

కానీ ఇప్పుడు అదే సినిమా నుండి తప్పుకుంటున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. తెలుగులో తను కమిట్ అయిన సినిమాల కారణంగా ఈ తమిళ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు అల్లు శిరీష్. తను తెలుగులో చేయబోయే సినిమాకు, సూర్య సినిమాకు డేట్స్ క్లాష్ అవుతుండడంతో మరొక ఆప్షన్ లేక ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చినట్లు శిరీష్ తెలిపారు.

తన అభిమాన హీరో సూర్యతో కలిసి నటించే ఛాన్స్ మరోసారి తనకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి శిరీష్ తెలుగులో సంజీవ్ రెడ్డి సినిమా మాత్రమే కమిట్ అయ్యాడు. సూర్య సినిమా కోసం కొద్దిరోజులు షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుంది. కానీ అల్లు శిరీష్ కావాలనే ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని టాక్. దర్శకుడు కెవి ఆనంద్ కు శిరీష్ కు మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి శిరీష్ స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి!

loader