అల్లు వారి వారసుడు శిరీష్ నుండి మూవీ వచ్చి మూడేళ్లు అవుతుంది. ఎట్టకేలకు ఆయన కొత్త సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఊర్వశివో రాక్షసివో చిత్ర టీజర్ డేట్ ప్రకటించారు.  


అల్లు శిరీష్ చివరి చిత్రం ఏబీసీడీ. 2019లో విడుదలైన ఏబీసీడీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఈ మూడేళ్ళలో ఒక్క సినిమా కూడా ఆయన నుండి రాలేదు. చాలా కాలంగా ప్రేమ కాదంట టైటిల్ తో ఒక చిత్ర చిత్రీకరణ జరుపుతున్నారు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ మార్చేశారు. ప్రేమ కాదంట టైటిల్ కాస్తా... ఊర్వశివో రాక్షసివో అని మార్చారు. నేడు ఈ చిత్ర టీజర్ డేట్ ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 29న ఊర్వశివో రాక్షసివో టీజర్ విడుదల కానుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ మేరకు ఒక రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఊర్వశివో రాక్షసివో చిత్రం నవంబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇక అల్లు శిరీష్ పరిశ్రమకు వచ్చి పదేళ్లు కావస్తుంది. ఆయనకు ఒక్క సాలిడ్ హిట్ పడలేదు. ఆ మధ్య అలిగి ఇంటి నుండి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. ముంబైలో కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్నారట. 

Scroll to load tweet…

ఇక అల్లు స్టూడియోస్ పేరుతో పెద్ద స్టూడియో నిర్మించారు. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా స్టూడియో లాంచ్ చేయనున్నారు. ఈ స్టూడియోలో అల్లు బ్రదర్స్ అర్జున్, శిరీష్, వెంకట్ భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. అల్లు స్టూడియో లాంఛ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు ప్రచారం జరుగుతుంది.