Asianet News Telugu

హీరోయిన్ ని ఏడిపించిన ఆకతాయిలు.. బుద్ది చెప్పిన మెగా హీరో!

మెగాహీరో అల్లు శిరీష్ మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాడు. గతంలో ఓ అభిమానికి అవసరముందని తెలుసుకొని తన ల్యాప్ టాప్ ని అతడికి పంపించాడు. 

allu sirish becomes real hero
Author
Hyderabad, First Published Feb 21, 2019, 12:37 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మెగాహీరో అల్లు శిరీష్ మిగిలిన హీరోలతో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాడు. గతంలో ఓ అభిమానికి అవసరముందని తెలుసుకొని తన ల్యాప్ టాప్ ని అతడికి పంపించాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంటాడు.

తాజాగా ఓ ఘటనతో రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ 'ఎబిసిడి' అనే చిత్రంలో నటించాడు. 'అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ' అనే ట్యాగ్ లైన్ తో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'మెల్లమెల్లగా' అంటూ సాగే పాటను చిత్రబృందం నేడు విడుదల చేసింది.

ఈ పాట లాంచింగ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ పాట చిత్రీకరణ సమయంలో కొందరు తాగుబోతులు అటుగా వెళ్తూ.. హీరోయిన్ రుక్సార్ ని కామెంట్ చేశారట.

అందరూ పనిలో బిజీగా ఉండి ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట. కానీ శిరీష్ మాత్రం షాట్ పూర్తయిన వెంటనే కారులో వెళ్లి రుక్సార్ ని కామెంట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఆమెకి క్షమాపణలు చెప్పించిన విషయాన్ని దర్శకుడు సంజీవ్ రెడ్డి వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios