అల్లు హీరో శిరీష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడేళ్లవుతోంది. 2013లో గౌరవం సినిమా ద్వారా పరిచయమైన శిరీష్ ప్రతిసారి డిఫరెంట్ కథలతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో మొత్తంగా నటించింది ఆరు సినిమాల్లోనే. అయితే అపజయాలతో సంబంధం లేకుండా శిరీష్ తన ప్రయత్నాలు సోలోగా చేసుకుంటూ వెళుతున్నాడు. 

ప్రస్తుతం ABCD సినిమాను ఎండ్ చేసే పనుల్లో బిజీగా ఉన్న శిరీష్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. మలయాళం మూవీకిరీమేక్ గా వస్తోన్న ఈ సినిమా మే 17న రిలీజ్ కానుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే శిరిష్ కొత్త కథలను ఎంచుకోవడంలో డిఫరెంట్ గా అడుగులు వేస్తున్నాడు. స్పెషల్ గా కథలను వినడానికి తనకంటూ ఒక టీమ్ ను సెట్ చేసుకున్నాడట. 

వారి ద్వారా కథలను ఫైనల్ చేస్తూ సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. కథలో ఎలాంటి అనుమానాలున్నా సీనియర్ రైటర్స్ దగ్గరకు వెళ్లి కరెక్షన్స్ చేయించుకోవడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడట. మొత్తంగా శిరీష్ కెరీర్ బాక్సా ఆఫీస్ హిట్ అందుకోవడానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు. మరి ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న ABCD ఎంతవరకు హిట్టొస్తుందో చూడాలి.