టాలీవుడ్ సినిమాలకు గత కొంత కాలంగా హిందీ హక్కుల రూపంలో మంచి లాభాలు వస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలకైతే షూటింగ్ మొదలవ్వకుముందే ప్రీ రిలీజ్ తో రికార్డులు బద్దలుకొట్టేస్తున్నాయి. తెలుగు సినిమాలకు టీవీలల్లో అలాగే యూ ట్యూబ్ లలో  మంచి రెస్పాన్స్ అందుతోన్న సంగతి తెలిసిందే. 

ఇక అల్లు అర్జున్ గత పది సినిమాలను దక్కించుకున్న గోల్డ్ మైన్ ఫిల్మ్స్ వారు ఇప్పుడు అల్లు బ్రదర్ శిరీష్ సినిమా హిందీ హక్కులను కూడా మంచి రేట్ కు కొనేశారు. అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళం రీమేక్ ఏబిసిడి సినిమాలో నటిస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఆ సినిమాకు నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. 

మలయాళంలో ఎబిసిడి మంచి హిట్టవ్వడంతో గోల్డ్ మైన్స్ వారు ముందుగానే 2.5 కోట్ల ధరకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా హిందీ డబ్బింగ్ హక్కులను దక్కించుకున్నారు. అల్లు శిరీష్ సినిమాల్లో రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ చేసిన చిత్రంగా ఎబిసిడి నిలిచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సినిమా రిలీజ్ కానుంది.