అల్లు శిరీష్ నటించిన మలయాళం రీమేక్ ABCD ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై కథానాయకుడు శిరీష్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు కథానాయిక రుక్సర్ దిల్లోన్ కి కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైనది. హిట్టయితేనే ఆమె ఇండస్ట్రీలో ఆఫర్స్ అందుకోగలదు. 

ఆమె నటించిన ఆకతాయి - కృష్ణార్జున యుద్ధం సినిమాలు డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక హీరో అల్లు శిరీష్ 2016లో శ్రీరస్తు శుభమస్తు తరువాత మరో యావరేజ్ హిట్ ను కూడా చూడలేదు. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. 7 నుంచి 9 కోట్ల మధ్యలో సినిమా కోసం ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సినిమా ఇతర బిజినెస్ ల రూపంలో నిర్మాతలకు మంచి లాభాల్నే అందించింది. 

7 కోట్ల థ్రియేటికల్ రైట్స్ తో విడుదలవుతున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 3 కోట్లను అందించింది. ఇక శాటిలైట్ హక్కులు 3 కోట్ల ధర పలుకగా డిజిటల్ రైట్స్ ద్వారా కోటి రూపాయలను అందుకున్నట్లు సమాచారం. మొదటిసారి అల్లు శిరీష్ సినిమాకు ముందే లాభాలు వచ్చాయి. ఇక సినిమా రిలీజ్ .అనంతరం షేర్స్ ను ఏ స్థాయిలో అందిస్తుందో చూడాలి. మొత్తంగా ఏబీసీడీ సినిమా 10 కోట్ల షేర్స్ ను రాబడితేనే అల్లు శిరీష్ ఫస్ట్ సక్సెస్ అందుకున్నట్లు లెక్క.