అల్లు అరవింద్ తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని సింగపూర్ వెళ్లారు. ఆయన కుమారులు అల్లు అర్జున్, బాబి, అల్లు శిరీష్ లతో సరదాగా గడుపుతున్నారు. ఓ రెస్టరెంట్లో డిన్నర్ చేస్తూండగా తీసిన ఫొటో ఇది. అల్ల అరవింద్ ..తన బ్యానర్ పై వచ్చిన పెద్ద హిట్ గోతా గోవిందం సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేసారని సమాచారం. 

తమ తండ్రి సక్సెస్ ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో ఎవరికి విజయం వచ్చినా ఇలా ఎక్కడో చోటకి ట్రిప్ వేయటం అల్లు అరవింద్ అలవాటు. ఇప్పుడు తమ తండ్రిని పార్టి ఇవ్వమని పిల్లలు అడిగి తీసుకు వచ్చారని తెలుస్తోంది. హ్యాపీ ఫ్యామిలీ అంటే ఇదే కదా.

వక్కంతం వంశీ దర్సకత్వంలో వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు' ఇండియా విడుదల తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా అంగీకరించలేదు. తదుపరి చిత్ర విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 

ఇందులో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఫిల్మ్ నగర వర్గాల సమాచారం. హిందీ చిత్రం సోను కె టిటు కి స్వీటీ ఆధారంగా ఈ సినిమా వుంటుందని, డిసెంబర్ 11న ప్రారంభం కానుందని చెబుతున్నారు. అల్లు అరవింద్ లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం వుందని తెలిసింది.