ఏడాది ప్రారంభంలోనే అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు అల్లు అర్జున్.ఈ మూవీ తరువాత బన్నీ నెక్స్ట్ మరో క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ చేశారు.  టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్నట్లు బన్నీ అధికారిక ప్రకటన చేశారు. సుకుమార్-బన్నీలది  హిట్ కాంబినేషన్ నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పుష్ప అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడం మరో విశేషం. 

కాగా ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది.  దీనిపై అధికారిక ప్రకటన చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. రేపు ఉదయం పుష్ప ప్రీ ప్రొడక్షన్ గ్లిమ్స్ మరియు షూటింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు, నిర్మాతలు తెలియజేశారు. షూటింగ్ అప్డేట్ కంటే కూడా పుష్ప ప్రీ ప్రొడక్షన్ గ్లిమ్స్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది. 

దర్శకుడు సుకుమార్ మొదటిసారి ఓ క్రైమ్ పాయింట్ ఎంచుకొని సినిమా తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో స్మగ్లింగ్ కి సహకరించే లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు. మొదటిసారి అల్లు అర్జున్ డీగ్లామర్ రోల్ చేయడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

  ఎప్పుడో మొదలు కావాల్సిన పుష్ప సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది.  దీనిపై అధికారిక ప్రకటన చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. రేపు ఉదయం పుష్ప ప్రీ ప్రొడక్షన్ గ్లిమ్స్ మరియు షూటింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు, నిర్మాతలు తెలియజేశారు. షూటింగ్ అప్డేట్ కంటే కూడా పుష్ప ప్రీ ప్రొడక్షన్ గ్లిమ్స్ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొని ఉంది.