ఇప్పుడు స్టార్స్ అందరి దృష్టీ ప్యాన్ ఇండియా సినిమాపై ఉంది. లోకల్ గానో , లేక కేవలం సౌత్ కో పరిమితం కాదల్చుకోలేదు మన హీరోలు. అందరూ ప్రభాస్ నడుస్తున్న దారిలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో సమాంతర మార్కెట్ క్రియేట్ చేసుకున్న బన్ని ...ప్యాన్ ఇండియా మార్కెట్ వైపు దృష్టి పెట్టారు. అయితే కేవలం నాలుగైదు భాషల్లోకి సినిమాని డబ్ చేసేస్తే అది ప్యాన్ ఇండియా సినిమా అయిపోదని బన్నికి తెలుసు. సినిమా అన్ని భాషలు వారు చూడాలంటే అందుకు తగ్గ కంటెంట్ ఉండాలి.

 తన దగ్గరకు వచ్చే కథలు ఎక్కువ శాతం సౌతిండియా మార్కెట్ ని టార్గెట్ చేసే కంటెంట్ తో ఉంటున్నాయి. తప్ప ప్యాన్ ఇండియాకు సరపడ ఉండటం లేదు. ఈ నేపధ్యంలో కొరటాల శివ కథ ఓకే చేసేటప్పుడు క్లియర్ గా చెప్పారట తాము చేయబోయే సినిమా ప్యాన్ ఇండియాకు తగినట్లు ఉండాలని. అందుకు తగినట్లు స్క్రిప్టులో మార్పులు, చేర్పులు చేయాలని కోరారట. దాంతో ఇప్పుడు కొరటాల ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారట. ఎందుకంటే కొరటాల కూడా ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా చేయలేదు. అలాగే బన్నీ “పుష్ప” మూవీ, కొరటాల శివ “ ఆచార్య” మూవీ పూర్తి అయ్యాక వీరిద్దరి సినిమా పట్టాలెక్కే అవకాశముంది.ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడింది.

ఇక అల్లు అర్జున్‌  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన  ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే . ఈ  సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటకే అల్లు అర్జున్ పుట్టిన రోజు  సందర్భంగా విడుదలైన బన్నీ  లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్  లారీ డ్రైవర్  పాత్రలో నటిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియాల లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.