Asianet News TeluguAsianet News Telugu

కొరటాలతో బన్ని.. వెనక రెండేళ్లు

 గత రెండేళ్లుగా కొరటాల శివతో సినిమా చేయాలని అల్లు అర్జున్ ఆలోచన. అయితే ఆ క్షణాలు రావటం లేదు. ఈ లోగా కొరటాల క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కొరటాల ప్రస్తుత స్టేటస్ చూసి, లెక్కలేసి కొరటాలకు కబురు పంపి, బన్ని సబ్జెక్ట్ లాక్ చేసాడంటున్నారు. అల్లు అరవింద్ మాస్టార్ ప్లాన్ ఇక్కడ వినియోగపడిందంటున్నారు. ఆచార్య తర్వాత ప్రాజెక్టు తనదే కావాలని బన్ని పట్టుబట్టి మరీ ఓకే అన్నారట. కథ పూర్తి కాకపోయినా...స్క్రిప్ట్ లాక్ కాకపోయినా...మనం చేస్తున్నాం అని అడ్వాన్ పంపి, లాక్ చేసారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. 

Allu Arjuns Intelligent Plan to Lock Koratala
Author
Hyderabad, First Published Jul 30, 2020, 6:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కొరటాల శివ వంటి స్టార్ డైరక్టర్ తో , ఏ ప్లాఫ్ రాని దర్శకుడుతో సినిమా చేయాలని ప్రతీ హీరోకి ఉంటుంది. అయితే అందరు హీరోలూ ట్రై చేస్తూంటే ఆయన ఎక్కడ దొరుకుతారు. అందుకే ఆయన్ని వలేసి పట్టాలి. టైమ్ చూసి కరెక్ట్ గా లాక్ చేయాలి. అదే అల్లు అర్జున్ చేసాడంటున్నారు. గత రెండేళ్లుగా కొరటాల శివతో సినిమా చేయాలని అల్లు అర్జున్ ఆలోచన. అయితే ఆ క్షణాలు రావటం లేదు. ఈ లోగా కొరటాల క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కొరటాల ప్రస్తుత స్టేటస్ చూసి, లెక్కలేసి కొరటాలకు కబురు పంపి, బన్ని సబ్జెక్ట్ లాక్ చేసాడంటున్నారు. అల్లు అరవింద్ మాస్టార్ ప్లాన్ ఇక్కడ వినియోగపడిందంటున్నారు. ఆచార్య తర్వాత ప్రాజెక్టు తనదే కావాలని బన్ని పట్టుబట్టి మరీ ఓకే అన్నారట. కథ పూర్తి కాకపోయినా...స్క్రిప్ట్ లాక్ కాకపోయినా...మనం చేస్తున్నాం అని అడ్వాన్ పంపి, లాక్ చేసారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి నుంచి చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన సుకుమార్ తో పుష్ప సినిమాని మొదలెట్టారు. అయితే కరోనా దెబ్బతో బ్రేక్ పడింది. వరస కేసులు పెరగటమే కానీ తగ్గే వాతావరణం కనపడకపోవటంతో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అనే విషయంలో క్లారిటికీ రాలేకపోతున్నారు. దాంతో ఈ ఖాళీ సమయానికి ఈ సినిమాలో తన పాత్రకు సంభందించిన మేకోవర్ కోసం కృషి చేస్తున్నారు. అలాగే చిత్తూరు స్లాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాదు లారీ డ్రైవింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక అక్కడితో ఆగకుండా తన తదుపరి చిత్రానికి దర్శకుడు కొరటాల శివను లాక్ చేసారు. 

కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా కరోనా ప్రభావంతో తాత్కాలికంగా ఆగింది. దాంతో కొరటాల శివ తన తదుపరి సినిమా స్క్రిప్టు రాసుకుంటున్నారు. ఆచార్య పూర్తైన వెంటనే పట్టాలు ఎక్కుంచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ని కలిసి స్క్రిప్టుని ఓకే చేయించుకున్నారు. ఇక అల్లు అర్జున్ సైతం పుష్ప పూర్తైన వెంటనే గ్యాప్ లేకుండా సినిమా చేయాలనుకుంటున్నారు. అందుకు కొరటాల శివ అయితే ఫెరఫెక్ట్ అని భావించి లాక్ చేసినట్లు చెప్తున్నారు. ఈ నేపధ్యంలో పుష్ప  సినిమా పూర్తి కాగానే వేరే దర్శకుడుని వెతుక్కోవాల్సిన అవసరం బన్నికి లేదు. అలాగే కొరటాల సైతం ఆచార్య తర్వాత వెంటనే ఈ సినిమాని పట్టాలు ఎక్కిస్తారు. ఇద్దరికి ఇది ఫెరఫెక్ట్ ప్లాన్. కొరటాల కూడా పుష్ప అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఈ లోగా ఆయన ఆచార్య పనులు కూడా  ఓ కొలిక్కి వస్తాయి. 
 
 అలాగే మీడియా సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం...ఈ సినిమాలో.. అల్లు అర్జున్ స్టూడెంట్ లీడ‌ర్ గా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. కాలేజీ రాజకీయాలు చుట్టు తిరుగుతుదంటున్నారు. అయితే ఇప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో కాలేజీ రాజకీయాలు తగ్గిపోయి..నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాయి. కాలేజీలో ఎగ్జామ్ పేపరు లీక్ వంటి వాటితో స్టూడెంట్ జీవితాలతో ఆడుకునే వారి పని పట్టబోతున్నారట. కొర‌టాల శివ సినిమాల‌న్నీ సోషల్ మెసేడ్ నేప‌థ్యంలో సాగుతుంటాయి. ఆ సినిమా కూడా అలాంటిదే అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మించే అవకాసం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios