యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చావు కబురు చల్లగా. రొమాంటిక్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు కౌశిక్ పి తెరెకెక్కించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంమార్చ్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. కార్తికేయ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండగా... లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. 

క్లాస్ అమ్మాయికి, మాస్ అబ్బాయికి మధ్య నడిచే రొమాంటిక్ కథనే చావు కబురు చల్లగా. కాగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రొమోషన్స్ జోరు పెంచారు. చిత్ర యూనిట్ అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు చిత్ర యూనిట్. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. 

అయితే చావు కబురు చల్లగా మూవీ ప్రీ రిలీజ్ వేడుక మార్చ్ 9న హైదరాబాద్ లోని కన్వెన్షన్ హాలు నందు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజు సాయంత్రం జరగనున్న వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు. దీనితో అల్లు అర్జున్ కి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు, సంతోషం వ్యక్తం చేశారు చిత్ర యూనిట్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.