ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డిని చూస్తే ఎవరైనా హీరోయిన్ అనుకోవాల్సిందే. ఇద్దరు పిల్ల తల్లైన స్నేహా రెడ్డి అసలు అలా కనిపించరు. భర్త గ్లామర్ ఇమేజ్ కి తగ్గట్టుగా స్నేహా రెడ్డి తన ఫిజిక్ ఫిట్నెస్ మైంటైన్ చేస్తారు. ఆ మధ్య జరిగిన నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కొత్త జంటను మించిన ఆకర్షణ వీరి సొంతం అన్నట్లుగా ఆ వేడుక సాగింది. 

మరి స్నేహారెడ్డి గ్లామర్ రహస్యం రెగ్యులర్ వ్యాయామం, డైట్ మరియు ఆరోగ్య నియమాలు పాటించడం. ప్రతి రోజు ఉదయం భర్త అల్లు అర్జున్ తో కలిసి స్నేహారెడ్డి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తారు. తాజాగా భర్తతో కలిస్ వ్యాయామం చేస్తున్న ఫొటోను స్నేహారెడ్డి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. ఒకే కలర్ జిమ్ అవుట్ ఫిట్ ధరించడం ఆ ఫోటో మరో ప్రత్యేకత. ట్విన్నింగ్ విత్ హస్బెండ్ అనే యాష్ ట్యాగ్ తో స్నేహారెడ్డి ఆ ఫోటో పోస్ట్ చేశారు. 

ఈ ఏడాది ప్రారంభంలోనే అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్మ మూవీ షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నారు. కేరళలో సుకుమార్ ఓ షెడ్యూల్ పూర్తి చేయగా లాక్ డౌన్ తరువాత చిత్ర షూటింగ్ వాయిదా పడింది. త్వరలో మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా డీ గ్లామర్ రోల్ చేస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.