స్టయిలీష్‌ స్టార్‌ లేటెస్ట్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య, అల్లు స్నేహారెడ్డి చేసిన ఐడియాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ వైఫ్‌ క్రియేటివిటీకి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆమెని అభినందిస్తున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటున్న అల్లు స్నేహారెడ్డి బన్నీతో తన పస్ట్ మీట్‌‌ నుంచి ఇప్పటి వరకు లైఫ్‌ని ఒకే ఒక్క ఫోటోల్లో బంధించి ప్రతిబింబింప చేయడం విశేషం. 

తాజాగా స్నేహారెడ్డి అల్లు అర్జున్‌, తమ పిల్లలతో కలిసి దిగిన నాలుగు ఫోటోలను ఓ ఫ్రేమ్‌గా డిజైన్‌ చేయించింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోషల్‌ మీడియా అభిమానులతో పంచుకుంది. ఇందులో స్నేహారెడ్డి, బన్నీతో తన పరిచయం నుంచి పిల్లలు పుట్టే వరకు ఒకే పోజులో స్కూటర్‌పై దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో మొదట బన్నీ, స్నేహారెడ్డి మాత్రమే ఉండగా, రెండో ఫోటోలో బన్నీ, స్నేహారెడ్డితోపాటు కుమారుడు అల్లు అయాన్ ఉన్నాడు. మూడో ఫోటోలు వీరికి కూతురు అర్హ తోడయ్యింది. చివరకు ఈ నలుగురు ప్రస్తుతం ఎంత హ్యాపీగా ఉన్నారో చూపించారు. 

ఒకే ప్లేస్‌లో, ఒకే కలర్‌ స్కూటీపై, ఒకే స్టయిల్‌లో వీరు ఫోటో దిగడం, అయితే టైమ్‌కి తగ్గట్టుగా ఫేస్‌లో మార్పులు, డ్రెస్‌లో మార్పులు చేశారు. ఈ నాలుగు ఫోటోలను కలిపి ఒక ఫ్రేమ్‌గా చేశారు. దాన్ని ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల స్పందించి క్యూట్‌ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల బన్నీ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేసొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బన్నీ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఇది ఆగస్ట్ 13న విడుదల కానుంది.