సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితిని  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్‌ వస్తున్నారని తెలిసి భారీగా అభిమానులు ఆసుపత్రికి తరలి వచ్చారు. 

హీరో సాయిధరమ్‌తేజ్‌ని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో సాయిధరమ్‌ తేజ్‌ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆయన ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్‌ వస్తున్నారని తెలిసి భారీగా అభిమానులు ఆసుపత్రికి తరలి వచ్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అల్లు అర్జున్‌.. సాయిధరమ్‌తేజ్‌కి యాక్సిడెంట్‌ జరిగినప్పుడు కాకినాడ షూటింగ్‌లో ఉన్నారు. అక్కడ `పుష్ప` చిత్రీకరణ జరుగుతుంది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆయన సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించలేకపోయారు. ఇప్పుడు గ్యాప్‌ దొరకడంతో హైదరాబాద్‌ వచ్చి నేరుగా సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించేందుకు వెళ్లారు. ఇదిలా ఉంటే సాయిధరమ్‌ తేజ్‌ గత శుక్రవారం ఐకియా రోడ్డులో బైక్‌పై యాక్సిడెంట్‌కి గురైన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సాయితేజ్‌ క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో జగపతిబాబు కూడా ట్వీట్‌ చేశారు. సాయితేజ్‌ కోలుకుంటున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సాయిధరమ్‌ తేజ్‌ నటించిన `రిపబ్లిక్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దేవా కట్టా దీనికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Scroll to load tweet…