వాలెంటైన్స్ డే సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తెగ హడావిడి చేశారు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొంత మంది ఆ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కూడా. ఈక్రమంలోనే  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వాలెంటైన్ డేను  స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు.. 

వాలెంటైన్స్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త స్పెషల్ గా కనిపించారు.. కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ స్పెషల్ గా ప్రేమికుల రోజులు సెలబ్రేట్ చేశారు. అందులో భాగంగా స్నేహారెడ్డిని లంచ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. వాలైంటైన్ డే సందర్భంగా అల్లు అర్జున్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అల్లు అర్జున్ ను ఇలా చూసి సర్ ప్రైజ్ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. 

ఇక అల్లు అర్జున్.. ఆయన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్కంగా స్నేహారెడ్డి తమకు సంబంధించిన చాలా విషయాలు ఫ్యాన్స్ కు అప్ డేట్ ఇస్తుంటుంది. బన్నీ తన పిల్లలతో ఆడుకునే వీడియోస్.. డాన్స్ వీడియోస్, ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ తో పాటు.. తమ ఫ్యామిలీకి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. అటు అల్లు అర్జున్ కూడా తన గారాలా కూతురుకు సంబంధించి కొన్ని విషయాలు అప్పుడప్పుడు శేర్ చేసుకుంటుంటాడు. ఫ్యానస్ ను దిల్ ఖుష్ చేస్తుంటాడు. 

ఈమధ్య స్నేహా రెడ్డి తన ఫ్యాషన్ పిక్స్ ను ఇన్ స్టాలో శేర్ చేసుకుంటుంది. డిఫరెంట్ ఫోటోస్ తో సోషల్ మీడియాను శేక్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. కాస్త హాట్ ఫోటోస్ తో.. అందరిని ఆశ్చర్యపుస్తోంది స్నేహా రెడ్డి. మొత్తానికి సోషల్ మీడియాలో అల్లు ఫ్యామిలీ సందడి తగ్గేదేలే అన్నట్టుగా మారిపోయింది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ.. నెక్ట్స్ పుష్ప సీక్వెల్ మూవీపై దృష్టి పెట్టాడు. కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయినా.. రీసెంట్ గా పుష్ప2 షూటింగ్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. 

ఈసినిమాతో మరికొన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నారు టీమ్. గతంలో జరిగిన పోరపాట్లు మళ్ళీ జరగకుండా.. జాగ్రత్త పడుతున్నారు. ఈవిషయంలో డైరెక్టర్ సుకుమార్ తో పాటు.. అల్లు అర్జున్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి అంతకు మించి పుష్ప2 ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన బన్నీ.. నెక్ట్స్ సినిమాలన్నీ పాన్ఇండియా రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు క్రేజ్ భారీగా ఉంది. ఇక పుష్పతో నార్త్ లో కూడా అదే క్రేజ్ ను సాధించాడు అల్లు అర్జున్.