స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ,  నాగబాబు , శిరీషా శ్రీధర్, బన్నీ వాసుల కొత్త చిత్రం ప్రారంభం  “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”  టైటిల్ తో వస్తోన్న చిత్రం ఏప్రిల్ 27,2018 విడుద‌ల‌ చేయాలని నిర్ణయం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్ తో టాప్ ఫాంలో దుసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా వక్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వం లో ఇటీవ‌లే పూజాకార్య‌క్రమాలు జ‌రుపుకున్న “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” రెగ్యుల‌ర్ ష‌షూటింగ్ ఈరోజు హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... .వ‌రుస‌ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యాన‌ర్ లో న‌టిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈరోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మెద‌లుపెట్టాము. బ‌న్ని ఎన‌ర్జి కి త‌గ్గ‌ట్టుగా చేసిన‌ ఈ క‌థ లో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వుంటాయి. అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా చేస్తుంది. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ ప‌ట్టిన వక్కంతం వంశీ వర్క్ చాలా ఎన‌ర్జిగా చేస్తున్నాడు. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్స్ టీంతో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తు్న్నారు. 2018 ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడ‌దుల చేస్తున్నాము. అని అన్నారు. 

నటీనటులు-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమ్యున‌ల్ , యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు-

ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ