సీనియర్ నటి టబు గత కొంత కాలంగా టాలీవుడ్ లో కనిపించడం లేదు. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలందరిని కవర్ చేసిన ఈ సీనియర్ నటి ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఆ మధ్య కొన్ని తెలుగు ఆఫర్స్ వచ్చినప్పటికీ మేడమ్ ఒప్పుకోలేదని టాక్. 

ముఖ్యంగా ఎన్టీఆర్ అరవింద సమేత లో ఒక రోల్ కోసం టబుని అనుకున్న దర్శకుడు త్రివిక్రమ్ కి ఆమె పలు కారణాల వల్ల నో చెప్పినట్లు రూమర్స్ వచ్చాయి. అది ఎంతవరకు నిజం అనే విషయాన్నీ పక్కనపెడితే టబును ఒక క్యారెక్టర్ కోసం దర్శకుడు ఆలోచించాడు అనేది మాత్రం నిజం. ఫైనల్ గా తారక్ సినిమా కోసం అనుకున్నప్పుడు కుదరలేదు. 

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఒక పాత్ర కోసం మళ్ళీ దర్శకుడు ఆమె కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బన్నీ తల్లి క్యారెక్టర్ కోసం టబును సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.