టాలీవుడ్ లో ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ ఫైట్ ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సారి ఆ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. స్టైలిష్ స్టార్ సూపర్ స్టార్ సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా పొంగల్ డేట్స్ ని లాక్ చేసుకున్నాయి. 

అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో - మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. ఈ రెండు సినిమాలు దేనికవే ప్రత్యేకం. అయితే మహేష్ సినిమా కంటే రెండు రోజుల ముందే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 12న చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. 

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు కూడా బన్నీ సినిమా తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.