అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ నేపధ్యంలో ఫలానా టైటిల్ పెట్టవచ్చంటూ రకరకాల టైటిల్స్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన ఈ చిత్రం తండ్రి,కొడుకు సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందని అందుకే ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా ప్రచారం జరిగింది. తరువాత అలకనంద అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్‌ వచ్చింది. 

తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదక వచ్చింది. ఈ సినిమాకు‘ అల వైకుంఠ పురంబులో’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే మనస్సు లో ఓ రకమైన పవిత్రమైన భావిన కలుగుతుందని, సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు. సినిమాకు ఇదే  ప్లస్ పాయింట్ కానుంది.  టైటిల్‌ను స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే మరి కొద్ది గంటల్లో టైటిల్‌ విషయంలో క్లారిటీ రానుంది.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవదీప్ మరో నెగిటివ్ రోల్ లో కనిపించనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.   సంక్రాంతి 2020కు ఈ చిత్రం విడుదల కానుంది.