Asianet News TeluguAsianet News Telugu

మహేష్ vs బన్ని.. పోటీ తప్పేలా లేదు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్  లో రూపొందుతున్న చిత్రం రిలీజ్ డేట్ విషయమై ట్రేడ్ లో సరైన క్లారిటీ లేదు. అల్లు అర్జున్ సాప్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని మొదట నిర్ణయించారు. 

Allu Arjun - Trivikram's film fixes release date!
Author
Hyderabad, First Published Jun 28, 2019, 8:46 AM IST

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్  లో రూపొందుతున్న చిత్రం రిలీజ్ డేట్ విషయమై ట్రేడ్ లో సరైన క్లారిటీ లేదు. అల్లు అర్జున్ సాప్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని మొదట నిర్ణయించారు.  అయితే ఈ సంవత్సరం ఒక్క రిలీజ్ లేకపోవటంతో అల్లు అర్జున్ ఎట్టి  పరిస్దితుల్లోనూ డిసెంబర్ రిలీజ్ పెట్టాలని ప్రెజర్ పెడుతున్నట్లు మీడియాలో కథనాలు  వచ్చాయి.  

అయితే అటువంటిదేమీ లేదని, సంక్రాంతికే సినిమాని రిలీజ్ చేస్తున్నారని, అదే తేదీని ఫిక్స్ చేసిన సమాచారం. సంక్రాంతికి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం రిలీజ్ అవుతోంది. ఆ చిత్రంతో పోటీగా ఈ చిత్రం రంగంలోకి దిగనుంది. 
 
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నారు  అల్లు అర్జున్‌. ఇప్పుడు దాన్ని కవర్ చేయాలనే ఆలోచనలో  ఉన్నారు. మరో ప్రక్క త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నారు. గతంలో వీరి కాంబినేషనలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే అల్లు అర్జున్ తో డీజే సినిమాకి పనిచేసింది. ఈ సినిమాలో కీలకపాత్రల్లో నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణలు,  మలయాళ నటుడు జయరామ్‌ బన్నీ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. గీత ఆర్ట్స్ మరియు యు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios