స్టైలిష్ స్టార్ నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈద్ సందర్బంగా చిత్ర యూనిట్ సినిమాకు సంబందించిన స్పెషల్ న్యూస్ ను ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. 

ఇక రెండవ అడుగు వేయడానికి సిద్ధమైంది. నేటి నుంచి సినిమా సెకండ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం సినిమాలో అల్లు అర్జున్ లుక్ ని రిలీజ్ చెయ్యాలని కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ - బన్నీ కాంబిననేషన్ లో వచ్చిన జులాయి - S/O సత్యమూర్తి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

ఆ బాక్స్ ఆఫీస్ సినిమాల తరువాత రానున్న ఈ సినిమాపై అభిమానులు అంచనాలు కూడా భారీగానే పెంచేసుకున్నాడు. ఇక సెకండ్ షెడ్యూల్ లో కథానాయిక పూజ హెగ్డే కూడా జాయిన్ కానుంది. అల్లు అరవింద్ - రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.