పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై విబేధాలు అంటూ వస్తున్న రాతలపై వరుణ్ అసహనం అలాంటి రాతలు బాధిస్తున్నాయన్న మిస్టర్ వరుణ్ తేజ్ చిరు, పవన్ లను డీజే ద్వారా ఒకే మీదకు తెచ్చి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని బన్నీ చెప్తాడట

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా.. మరెందుకు మీడియాలో అన్నదమ్ముల వైరంపై కథనాలు పుంఖాను పుంఖాలుగా వస్తుంటాయి. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ఏదైనా వేడుక జరిగితే.. అది ఆడియో అయినా, ప్రీ రిలీజ్ అయినా...మెగాస్టార్ వస్తే, వపన్ రాజని, పవన్ వస్తే మెగాస్టార్ రాడని... ఇక ఇద్దరూ తమ సినిమా ఫంక్షన్లకి అస్సలు ఒకరిని ఒకరు పిలిచినా రారని రకరకాలుగా వార్తలు వస్తుంటాయి. ఇలా చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ మధ్య సఖ్యత లేదని, అన్నదమ్ముల మధ్య విబేధాలున్నాయని తరచుగా వార్తలు తెరమీదకి వస్తుంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించినప్పటికీ... మెగా హీరోల ఫంక్షన్లన్నింటిలో ప్రతిసారీ ఇద్దరూ వుండాలనేది సదరు కథనాలు ప్రచారం చేస్తున్న వారి ఆలోచన.

అయితే ఇలాంటి ఈ రాతలు తమని చాలా బాధిస్తుంటాయని వరుణ్‌ తేజ్‌ చెప్పాడు. పవన్‌, చిరంజీవి మధ్య ఎలాంటి అనుబంధం వుందనేది తమ కుటుంబ సభ్యులందరికీ తెలుసునని, దాన్ని గురించి ప్రతిసారీ వివరణ ఇచ్చుకోవటం సాధ్యం కాదని, అలాంటప్పుడు ఎవరెవరో ఏదేదో రాసేస్తూ వుంటే అది తమ కుటుంబ సభ్యులని ఎంతగానో బాధ పెడుతుందని మీడియా గుర్తించాలని వరుణ్‌ అన్నాడు.



సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో రిలీజ్‌ తర్వాత పవన్‌, చిరంజీవి మళ్లీ కలిసి కనిపించలేదు. గుంటూరులో జరిగిన ఖైదీ నంబర్ 150 ఈవెంట్‌కి పవన్‌ మిస్‌ అయిన దగ్గర్నుంచీ మళ్లీ అన్నదమ్ముల మధ్య విబేధాల వార్తలు తెర మీదకి వచ్చాయి. అయితే పవన్‌కి చిరంజీవితో కానీ, నాగబాబుతో కానీ ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని, అల్లు అరవింద్‌తో మాత్రమే పవన్‌కి కొన్ని మనస్పర్ధలు వుండేవని, అయితే అవన్నీ సెటిలయ్యాయని, అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ తో రాజీకి వచ్చాడని... డీజే దువ్వాడ జగన్నాథం ప్రమోషన్ ఫంక్షన్ లో పవన్ అభిమానులకు బన్నీ సర్ప్రైజ్ ఇస్తాడని అంటున్నారు. మరి బన్నీ పవనిజం జిందాబాద్ అంటాడా.. లేక చెప్పను బ్రదర్ అంటాడో తేలిపోనుంది.