ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కథ నచ్చితే పాత్ర ఎలా ఉన్నా.. అభ్యంతరాలుపెట్టడం లేదు. చాలా మంది కుర్ర హీరోలు మిడిల్ ఏజ్డ్ పాత్రల్లో సైతం కనిపించడానికి రెడీ అవుతున్నారు.

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అటువంటి పాత్రనే పోషించడానికి సిద్ధపడుతున్నాడని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న బన్నీ అది పూర్తయిన తరువాత దర్శకుడు వేణుశ్రీరామ్ తో తన తదుపరి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాకి ఐకాన్ అనే టైటిల్ కూడా పెట్టారు. కథ ప్రకారం ఈ సినిమాలో బన్నీ రెండు, మూడు గెటప్పులలో కనిపిస్తాడట. ముఖ్యంగా సినిమాలో అతడి మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుందని అంటున్నారు. మొదటిసారిగా బన్నీ మిడిల్ ఏజ్డ్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

దీంతో పాటు మరో రెండు గెటప్పులు ఉంటాయట. అందులో ఒకటి యంగ్ హీరో క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఈ పాత్రల కోసం బన్నీ సినిమాలో కాస్త ఎక్కువగానే విగ్గులు వాడతారట. బన్నీ తన సినిమాల్లో విగ్గులు పెద్దగా వాడరు.

కానీ 'ఐకాన్' కోసం మాత్రం రకరకాల విగ్గులు వాడబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత తొందరగా త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి 'ఐకాన్' సినిమా సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.