బన్నీ బాక్సింగ్ చేస్తాడట!

First Published 21, Dec 2017, 10:59 AM IST
allu arjun to don the role of a boxer
Highlights

కొత్త డైరెక్టర్ తో కొత్త రోల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. కథకు ప్రాముఖ్యతనిస్తూ.. డైరెక్షన్ లో అనుభవం లేకపోయినా రిస్క్ చేస్తున్నాడు బన్నీ. ఈ క్రమంలో అతడి తదుపరి సినిమా ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నాడని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఓ కొత్తబ్బాయి బన్నీను కలిసి కథ వినిపించాడని వార్తలు వచ్చాయి. బన్నీ కూడా సదరు కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ కథతో సినిమా చేసే దిశగా ఆలోచనలు మొదలుపెట్టాడు బన్నీ. బాక్సింగ్ నేపధ్యంలో ఈ కథ నడుస్తుంది. 

ఈ కథతోనే బన్నీ నిర్మాతగా కూడా మారబోతున్నాడు. నిజానికి బన్నీ తండ్రి అల్లు అరవింద్ కు 'గీతాఆర్ట్స్' బ్యానర్ ఉన్నప్పటికీ తనకు కూడా సొంతంగా బ్యానర్ ఉండాలని నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది కూడా చదవండి

రాజమౌళి ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నారా

https://goo.gl/wTytsd

loader