అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా డిసంబర్ లోనే విడుదలవుతోందనే మాటలు మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయడానికి సంక్రాంతి కంటే బెటర్ సీజన్ లేదనే విషయం ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది.

ఆ విధంగా చూసుకుంటే బన్నీ-త్రివిక్రమ్ లు తన కమర్షియల్ ఎంటర్టైనర్ ని  సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయాలనుకుంటారు. కాబట్టి సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోన్న మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి ఇది పెద్ద పోటీదారుగా నిలుస్తుంది.

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే.. ఆ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ చాలాకాలం గ్యాప్ తీసుకొని మరీ త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఓకే చేశాడు. కథ పక్కా ప్రేక్షకులకు నచ్చుతుందనే ధీమాతో ఉన్నారు. మరోపక్క మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబోపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మాస్ పల్స్ తెలిసిన అనీల్ రావిపూడి తనకథలో కామెడీతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా చూసుకుంటాడు. ఈ రెండు పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుండడంతో మిగిలిన నిర్మాతలంతా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువే.. ఎప్పటిలానే బాలకృష్ణ తన సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారు. మరి ఈ పోటీలో గెలుపెవరిదో.. చూడాలి!