అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి అల్లు అర్జున్ తిరిగి కృతజ్ఞతలు చెప్పారు.
ఇటీవల భారత ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన విషయం తెలిసింది. ప్రధాన అవార్డ్స్ లో ఒకటిగా భావించే ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ ని వరించింది. పుష్ప చిత్రంలోని నటనకు గానూ అల్లు అర్జున్ అవార్డుకి ఎంపికయ్యారు. ఈ క్రమంలో అభిమానులు, చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్(Allu Arjun) ని అభినందించారు. కాగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రత్యేకంగా అభినందించారు. అల్లు అర్జున్ అరుదైన గౌరవం పొందిన నేపథ్యంలో అధికారికంగా లెటర్ విడుదల చేశారు.
నిర్మాతల మండలి ప్రెసిడెంట్ కే ఎల్ దామోదర్ ప్రసాద్ తో కూడిన పాలకవర్గ సభ్యులు ఈ లెటర్ విడుదల చేశారు. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందడం తెలుగు సినిమాకు గర్వకారణమని ఆ లెటర్ లో పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అప్రిసియేషన్ లెటర్ కి బదులుగా అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పారు.
ఈసారి జాతీయ అవార్డుల వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 6 అవార్డులు కొల్లగొట్టింది. పుష్ప చిత్రానికి 2 అవార్డులు దక్కాయి. కొండపొలం, ఉప్పెన చిత్రాలు చెరో అవార్డు గెలుపొందాయి. మొత్తంగా టాలీవుడ్ కి 11 అవార్డులు దక్కాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో తెలుగు సినిమా జాతీయ అవార్డులు పొందలేదు. ఇక ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొట్టమొదటి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కారు.
అలాగే అల్లు అర్జున్ పై ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇంస్టాగ్రామ్ స్పెషల్ వీడియో చేసింది. ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతున్న ఏకైన ఇండియన్ హీరో అల్లు అర్జున్ కావడం మరో విశేషం. అల్లు అర్జున్ రేంజ్ ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. పుష్ప 2తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.
