స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు గుడ్ న్యూస్ పంచారు. తాను కరోనా మహమ్మారి నుండి బయటపడ్డట్లు తెలియజేశారు. తాజా పరీక్షలలో కోవిడ్ నెగటివ్ గా నిర్ధారణ అయినట్లు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ట్విట్టర్లో అందరికీ హాయ్, నాకు కరోనా నెగిటివ్ గా తేలింది. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. అంటూ అల్లు అర్జున్ సందేశం పోస్ట్ చేశారు. 


అలాగే 15రోజుల క్వారంటైన్ తరువాత కుటుంబాన్ని కలిశానని ఆయన ఓ భావోద్వేగ సందేశం పంచుకున్నారు. పిల్లలు అర్హ, అయాన్ లను నేడు కలిసిన వీడియో అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రెండు వారాలు పిల్లలు, కుటుంబాన్ని చాలా మిస్ అయినట్లు అల్లు అర్జున్ ఆ వీడియో ద్వారా తెలియజేశారు. గత నెల 28న అల్లు అర్జున్ తనకు కరోనా సోకినట్లు తెలియజేశారు. అప్పటి నుండి అల్లు అర్జున్ సెల్ఫ్ ఐసోలేట్ కావడంతో పాటు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. 


అల్లు అర్జున్ కి కరోనా నెగిటివ్ అన్న విషయం తెలుసుకొని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందం పంచుకుంటున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తి కారణంగా పుష్ప షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే పుష్ప షూటింగ్ పలుమార్లు నిలిచిపోయింది. దర్శకుడు సుకుమార్ వీలైనంత త్వరగా పుష్ప షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. 


అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా పుష్ప విడుదల కానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.