స్టయిలీష్‌స్టార్‌, లేటెస్ట్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి కరోనా సోకింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఫ్యాన్స్ ని ఆందోళన చెందవద్దన్నారు.

కరోనా సెలబ్రిటీలను వెంటాడుతుంది. వరుసగా సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ కరోనాతో పోరాడుతున్నారు. కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా వచ్చింది. అల్లు అరవింద్‌, బండ్ల గణేష్‌, త్రివిక్రమ్‌, దిల్‌రాజు కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టయిలీష్‌స్టార్‌, లేటెస్ట్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి కరోనా సోకింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

`నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే నాకు నేను సెల్ఫ్‌ ఐసోలేట్‌ అయ్యాను. కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా. ఇటీవల నన్ను కలిసి వారంతా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నా. ఇంట్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి` అని తెలిపారు.

Scroll to load tweet…

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప`చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే కరోనా ప్రభావంతో చాలా వరకు స్టార్‌ హీరోలంతా షూటింగ్‌లు ఆపేశారు. కానీ సినిమాని త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని తగ్గించి చిత్రీకరించారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందని తెలుస్తుంది. ముందుస్తుగానే షూటింగ్‌ ఆపేసి ఉంటే బాగుండేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కరోనా మరో స్టార్‌ హీరోకి సోకడం విచారకరం. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదల కానుంది.