Asianet News TeluguAsianet News Telugu

భార్య అల్లు స్నేహారెడ్డికి 2.5కోట్ల గిఫ్ట్.. అల్లు అర్జున్‌ భారీ సర్ ప్రైజ్‌ ఏంటో తెలుసా?

అల్లు అర్జున్‌కి తన భార్య అల్లు స్నేహారెడ్డి అంటే ఎంతో ప్రేమ. దాన్ని అనేక సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు చాలా ఖరీదైన గిఫ్ట్ తో ఆ ప్రేమని చూపించాడట బన్నీ. 

allu arjun surprise his wife allu sneha reddy with costly gift viral now arj
Author
First Published May 11, 2024, 11:30 AM IST

అల్లు అర్జున్‌ తన భార్య అల్లు స్నేహారెడ్డిపై ప్రతి సందర్భంలోనూ తన ప్రేమని వ్యక్తం చేస్తూనే ఉంటాడు. సోషల్‌ మీడియాలో ఆ విషయాలను పంచుకుంటాడు. అప్పట్లో `ఇద్దరమ్మాయిలతో` సినిమా సమయంలోనే భార్యపై తనకు ఉన్న ప్రేమని బయటపెట్టాడు. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వాళ్లు తనకు రెండు కళ్లలాంటి వారు అని చెప్పాడట. మరి మీ భార్య ఏంటి ? అని దర్శకుడు అడిగితే ఆమె నా హార్ట్ సర్‌, హార్ట్ లేకపోతే జీవితమే లేదు, అల్లు స్నేహారెడ్డి లేకపోతే తన లైఫే లేదు అని చెప్పి తన భార్య మనసునిదోచుకున్నాడు బన్నీ. 

ఇటీవల `ఆర్య` 20ఏళ్ల వేడుకలోనూ తన ప్రస్తావన తెచ్చాడు. ఆమెతో తనది వన్‌ సైడ్‌ లవ్వే అని తెలిపారు. ఇక్కడి నుంచి ప్రేమ వెళ్లడమే గానీ, అక్కడి నుంచి లేదన్నాడు. అది కూడా నవ్వుతూ చెప్పాడు. అంటే తన భార్య అల్లు స్నేహారెడ్డి అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేశాడు బన్నీ. ఇప్పుడు ఆ ప్రేమని మరింత కాస్ట్లీగా వెళ్లడించాడట. భార్యకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట. ఏకంగా రెండున్నర కోట్ల విలువలైన గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 

మరి ఇంతకి తన భార్యకి బన్నీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఏంటనేది చూస్తే, ఆమెకి లేటెస్ట్ మోడల్‌ కాస్ల్టీ బీఎండబ్ల్యూ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇటీవలే బన్నీ దీన్ని బుక్‌ చేశాడు. తాజాగా ఆ కారు ఇంటికి వచ్చింది. అల్లు అర్జున్‌ కారుని బుక్‌ చేస్తున్న ఫోటోతోపాటు కారు ఇంటికి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఇది తన భార్య కోసమే అని తెలుస్తుంది. ఆమెకి రెండున్నర కోట్ల విలువలైన బిఎండబ్ల్యూ కారుతో సర్‌ప్రైజ్‌ చేశారట బన్నీ. మరి ఇందులో నిజమెంతా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఊపేసింది. అలాగే `పుష్ప పుష్ప` అంటూ సాగే పాట సైతం దుమ్ములేపుతుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కానీ `పుష్ప`లోని మొదటి పాట అంతటి రీచ్‌ మాత్రం లేదని తెలుస్తుంది. ఇక సుకుమార్‌ దర్శకత్వం వహించిన `పుష్ప2` మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీన్ని ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ మూవీతో పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ని దాని గ్లోబల్‌ మార్కెట్‌కి రీచ్ కావాలని భావిస్తున్నారు. 

`పుష్ప` సినిమా పెద్ద విజయం సాధించడంతో ఈ రెండో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీన్ని అంతే భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు సుకుమార్‌. దీంతో సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ ఉంది. `పుష్ప` చిత్రం తెలుగులో కంటే నార్త్ లో ఎక్కువగా వెళ్లింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా బాగా ఆడింది. ఇప్పుడు వారంతా పార్ట్ 2 కోసం చూస్తున్నారు. సినిమా బాగుంటే ఇది రికార్డులు షేక్‌ చేసే మూవీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సునీల్‌, అనసూయ కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios