ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్... బన్నీ `పుష్ప` టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?
`పుష్ప` సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు తప్ప మరే అప్‌డేట్ రాలేదు. షూటింగ్ డిటెయిల్స్ తప్ప మరేది పంచుకోలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ట్రీట్‌ఇచ్చేందుకు సుకుమార్ టీమ్ రెడీ అవుతుందట.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `ఆర్య`, `ఆర్య2` తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. `అల వైకుంఠపురములో` వంటి సూపర్ హిట్ తర్వాత బన్నీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.
ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మారేడుమిల్లిలో, రంపచోడవరంలో చిత్రీకరణ పూర్తయ్యింది. మూడో షెడ్యూల్ ప్రస్తుతం తెన్‌కాశీలో జరుగుతంది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు తప్ప మరే అప్‌డేట్ రాలేదు. షూటింగ్ డిటెయిల్స్ తప్ప మరేది పంచుకోలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ట్రీట్‌ఇచ్చేందుకు సుకుమార్ టీమ్ రెడీ అవుతుందట.
ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారట. టీజర్‌తో సినిమా హైప్‌ని భారీగా పెంచేలా ప్లాన్ చేస్తున్నారట. పాన్ ఇండియా సినిమాగా ఇది రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీమేకర్స్ దీన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాబట్టి టీజర్ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారట. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. శేషాచల అడవుల్లో మాత్రమే కనిపించే ఎర్రచందనం స్మిగ్లింగ్ ప్రధానంగా సినిమా కథ సాగుతుందట. ఇందులో చాలా వరకు యదార్థ సంఘటనలుంటాయని టాక్. ఇందులో బన్నీ `పుష్పరాజ్`గా కనిపిస్తారు. ఎర్రచందనం స్మిగ్లింగ్‌లో ఇరుక్కే వ్యక్తిగా కనిపిస్తాడని సమాచారం.