ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కాకినాడ పోర్ట్ లో జరుగుతుంది. అక్కడి షూటింగ్‌ సన్నివేశాలు మంగళవారం బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆయా వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్‌ బయటకు రావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది.

అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లీక్‌ల బెడద వెంటాడుతుంది. గతంలోనూ పలు లీక్ లు సినిమా టీమ్‌ని ఇబ్బంది పెట్టాయి. కొన్ని డైలాగ్‌ సీన్లు, సాంగ్‌ సీన్లు లీక్‌ అయ్యాయి. ఈ విషయంలో పోలీస్‌ కేసు కూడా అయ్యింది. అయినా లీకులు సినిమాని వదల్లేదు. తాజాగా మరికొన్ని సీన్లు లీక్‌ అయ్యాయి. 

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కాకినాడ పోర్ట్ లో జరుగుతుంది. అక్కడి షూటింగ్‌ సన్నివేశాలు మంగళవారం బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆయా వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్‌ బయటకు రావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది. మరి దీనిపై చిత్ర బృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Scroll to load tweet…

బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. రెండు పార్ట్ లుగా దీన్ని విడుదల చేయబోతున్నారు. క్రిస్మస్‌ కానుకగా మొదటి పార్ట్ విడుదల కానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో బన్నీ పూర్తిగా డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన `దాక్కో దాక్కో మేక.. `పాట అన్ని సామాజిక మాధ్యమాల్లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.