Asianet News TeluguAsianet News Telugu

Pushpa: పుష్ప ఒక్క మూవీ నాలుగు సినిమాల కష్టం.. బాలయ్యకు కంగ్రాట్స్ చెప్పిన బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. 

Allu Arjun Speech at Pushpa Pre Release event
Author
Hyderabad, First Published Dec 12, 2021, 11:27 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో డిసెంబర్ 17న ఈ చిత్రం విడుదలవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో నేడు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

అభిమానుల కోలాహలాల మధ్య ప్రీ రిలీజ్ వేడుక సందడిగా జరిగింది. అల్లు అర్జున్ ఈవెంట్ చివర్లో తనదైన శైలిలో ప్రసంగంతో అభిమానులని అలరించారు. అల్లు అర్జున్ తన అభిమానుల గురించి మాట్లాడుతూ.. నేను సంపాదించుకున్నది మిమ్మల్నే.. మీ కంటే నాకు ఎక్కువ ఏదీ కాదు అని అన్నారు. 

ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. దేవిశ్రీతో నా జర్నీ మొదలై ఇది మూడవ దశాబ్దం. ఈ చిత్రంలో ప్రతి సాంగ్ అద్భుతంగా కంపోజ్ చేశాడు దేవిశ్రీ. ప్రతి సాంగ్ దేనికదే విభిన్నంగా ఉంది. అలాగే ఈ పాటలకు సాహిత్యం అందించిన చంద్రబోస్ పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. పుష్ప ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టంగా అల్లు అర్జున్ అభివర్ణించాడు. 

ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. చాలా మందితో నటిస్తాం.. కానీ రష్మిక నా మనసుకు నచ్చిన నటి అని అల్లు అర్జున్ అన్నాడు. వేదికపైనే రష్మికతో 'ఏందీ పిల్ల నచ్చిననా ' అంటూ సరదాగా డైలాగ్ చెప్పి అలరించాడు. అలాగే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సమంత గురించి కూడా బన్నీ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్ అంటే ఇది చేస్తాను.. అది చేయను అనే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ సమంత ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. వచ్చి అద్భుతంగా పెర్ఫామ్ చేసి వెళ్ళింది. అందుకు సమంతకు థ్యాంక్స్ అని బన్నీ అన్నాడు. 

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్, దేవిశ్రీ రావడం లేదు అంటే నేను నమ్మలేదు. వెంటనే ఫోన్ తీసుకుని ప్రైవేట్ జెట్ అరేంజ్ చేస్తాను రమ్మని చెప్పాను. కానీ సుకుమార్ నన్ను కన్విన్స్ చేశాడు. నేను, సుకుమార్ వేరు కాదు. ఈ సినిమాకి ఎంత మంచి పేరు వచ్చినా అది మా ఇద్దరిది అని బన్నీ తెలిపారు. 

ఇక చివర్లో అల్లు అర్జున్ త్వరలో టాలీవుడ్ లో విడుదల కాబోయే చిత్రాల గురించి మాట్లాడారు. అఖండ చిత్రం విజయం సాధించినందుకు బాలయ్యకు, బోయపాటికి కంగ్రాట్స్. చాలా రోజుల తర్వాత వచ్చిన సిక్సర్ లాంటి మూవీ అఖండ. తెలుగు సినిమాకు ఊపు తెచ్చింది. పుష్ప తర్వాత విడుదల కాబోతున్న శ్యామ్ సింగ రాయ్, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ చిత్రాలు కూడా బాగా విజయం సాధించాలి అని అల్లు అర్జున్ కోరారు. 

Also Read: Pushpa: నా అందం ఎలాగూ టివిలో చూస్తున్నారు, ఇక్కడ మాత్రం కంకణం కట్టుకున్నా..అనసూయ

Follow Us:
Download App:
  • android
  • ios