మమ్మల్ని గర్వపడేలా చేశారు.. మెగాస్టార్ పై అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
మేమే కాదు..ఇండస్ట్రీ అంతా గర్వపడేలా చేశారు.. మీరు చేసిన సేవకు సరైగ గౌరవం దక్కింది అంటూ..మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల జల్లుతో పాటు.. ప్రేమను కూడా కురిపించారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
మెగాస్టార్ చిరంజీవికి ఎవరై చెప్పనంత వెరైటీగా విషెష్ చెప్పారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. చిరంజీవికి పద్మ విభూషన్ వచ్చిన సందర్భంగా స్పెషల్ గా శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. తన సోషల్ మీడియా పేజ్ లో పెట్టిన పోస్ట్ అందరికి ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి మరో అదుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాదిలాగే.. ఈఏడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. కళారంగానికి మెగాస్టార్ చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం చిరును గుర్తించింది.
1978లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు చిరంజీవి. అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా కళారంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించగా.. నేటి సర్కార్ పద్మవిభూషన్ ను ప్రకటించింది.
మరోవైపు చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై ఆయన అల్లుడు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే..? ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు ఇదొక గొప్ప గౌరవం. ఈ అచీవ్ మెంట్ ను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మమ్మల్నందరినీ ఎంతో గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.
అంతే కాదు ఈ పోస్ట్ లో స్పెషల్ పోస్ట్ తో పాటు.. ఇప్పటి వరకు చిరంజీవి సాధించిన ఘనతలను తెలుపుతూ.. చిరంజీవి ఫోటో స్కెన్ ను కూడా పోస్ట్ చేశారు అల్లు అర్జున్. ఈ ఫోటో అందరికి ఆకర్శిస్తోంది. అంతే కాదు.. మెగా అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు ఈ పోస్ట్ చూసి. ఇక అల్లు అర్జున్ తో పాటు.. టాలీవుడ్ స్టార్స్ అంతా మెగాస్టార్ ను ప్రత్యేకంగా విష్ చేస్తున్నారు.