ఇప్పుడు బన్నీ తనయుడు కూడా బాలనటుడిగా ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన వీడియోనే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. `గని` టైటిల్‌ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు.

అల్లు ఫ్యామిలీ నుంచి వారసులు దిగుతున్నారు. అల్లు రామలింగయ్య వారసత్వం నుంచి అల్లు అర్జున్‌(Allu Arjun), అల్లు శిరీష్‌ హీరోలుగా రాణిస్తున్నారు. ఇటీవల బన్నీ కూతురు అల్లు అర్హ (Allu Arha)కూడా బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆమె సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రంలో బాల భరతగా నటించింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడు Allu Arjun తనయుడు కూడా బాలనటుడిగా ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన వీడియోనే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 

అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌(Allu Ayaan) వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంది. `గని`(Ghani Movie) స్టయిల్‌లో ఆయన వర్కౌట్‌ చేస్తూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా Ghani Movie చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో Varuj Tej బాక్సర్‌గా నటిస్తున్నాడు. తాజాగా `గని` టైటిల్‌ సాంగ్ ని విడుదల చేశారు. గని అనే బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌ చేసే వర్కౌట్స్ ప్రధానంగా ఈ పాట సాగుతుంది. 

అయితే అల్లు అయాన్‌తో ఈ పాటని రీక్రియేట్‌ చేశారు. వరుణ్‌ తేజ్‌ మాదిరిగా ఈ పాటలో నటించాడు. వరుణ్ తేజ్‌ తరహాలో భారీ వర్కౌట్లు చేశాడు. మెగా, అల్లు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. దీనికి వరుణ్‌ తేజ్‌ కూడా ఆశ్చర్యానికి గురి కావడం విశేషం. ఈ వీడియోని గీతా ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఇందులో అల్లు అయాన్‌ని చూసి బన్నీ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అచ్చం బన్నీలాగే ఉన్నాడని, ఎనర్జీ, స్టయిల్‌లో తండ్రిని తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడని తెలిపారు. అంతేకాదు అల్లు అయాన్‌ ఎంట్రీ ఎప్పుడని అడుగుతున్నారు. అంతేకాదు త్వరలో అల్లు అయాన్‌ ఎంట్రీ ఖాయమే అంటున్నారు అభిమానులు. 

Scroll to load tweet…

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న `గని` చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించారు. సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 3న విడుదల కానుంది. 
also read: Unstoppable: బాలయ్య నెక్స్ట్ గెస్ట్ గా నాచురల్ స్టార్... ఆయన ఫైర్ తట్టుకోగలడా!

also read: 'గద్దలకొండ గణేష్' బ్యూటీ రెడ్ హాట్ ఫోజులు.. మెస్మరైజ్ చేసే సౌందర్యం