ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పెర్ఫామెన్స్, డాన్స్ తోనే కాదు. తన ఆటీట్యూడ్ తో కూడా ఆడియన్స్ మనసు దోచేసుకుంటున్నాడు. తను తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయంతో ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు బన్నీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పెర్ఫామెన్స్, డాన్స్ తోనే కాదు. తన ఆటీట్యూడ్ తో కూడా ఆడియన్స్ మనసు దోచేసుకుంటున్నాడు. తను తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయంతో ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు బన్నీ.
చాలా మంది స్టార్స్ డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుని ఉంటారు. దాని కోసమే కష్టపడతాడు. డబ్బు వస్తుందంటే ఆలోచించకుండా ఏ పని అయినా చేసేవారు ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా ఖచ్చితంగా ఏదోఒక ప్రాడెక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉంటూ.. కోట్లు గడిస్తుంటారు. అందులో మంచి చెడు ఆలోచించరు.
కానీ కోట్లు సంపాదించడం కంటే విలువ నిలబెట్టుకోవడం అన్నింటికంటే ముఖ్యం అని అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొందరు మాత్రమే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కొన్ని ప్రమాదకరమైన ఉత్పత్తులకు ప్రచారం చేస్తే.. తమను ఫాలో అయ్యే అభిమానుల ఆరోగ్యం దెబ్బ తింటుంది అని ఆలోచించే నటీనటులు ఎంత మంది ఉంటారు చెప్పండి. అలా ఆలోచించె గొప్ప మనసున్నవాడు అని నిరూపించాడు అల్లు అర్జున్.
ఫ్యాన్స్ ఆరోగ్యం కోసం బన్నీ కోట్ల వదులుకున్నాడు. కళ్ళ ముందు కట్టలు కన పిస్తున్నా.. టెమ్ట్ అవ్వకుండా.. వద్దు అనేవాడు. తాజాగా అల్లు అర్జున్ ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడానికి నో చెప్పాడు దానికి ప్రధానమైన కారణం పాన్ పరాక్ ఎన్ డోర్స్ కావడమే. తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈయన. దాంతో కార్పొరేట్ కంపెనీలు కూడా తమ బ్రాండ్ ప్రమోట్ చేయమని బన్నీ వెంట పడుతున్నాయి.
సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గానూ చాలా బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. చాలా బ్రాండ్స్ ను అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా తాజాగా ఈయనకు మరో కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది.. కానీ దానికి నో చెప్పారు అల్లు అర్జున్. దానికి కారణం అది టొబాకో సంబంధిత ఉత్పత్తి కావడమే. పాన్ పరాక్ యాడ్ బ్రాండింగ్ చేయమని బన్నీని కోరితే ఆయన తిరస్కరించారు. తాను అది ప్రమోట్ చేస్తే అభిమానులు కూడా అదే ఫాలో అవుతారనే కారణంతో దాన్ని రిజెక్ట్ చేశాడు బన్నీ.
ఆ కంపెనీ చాలా సార్లు బన్నీని ఒప్పించే ప్రయత్నం చేసిందట. కోట్లుకు కోట్లు ఆఫర్ చేసిందట. కాని ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అలాంటి బ్రాండింగ్ తాను చేయనని తెగేసి చెప్పాడట ఐకాన్ స్టార్. అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు అల్లు అర్జున్ పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
