అల్లు అర్జున్‌ నటించిన `ఆర్య` చిత్రం శుక్రవారంతో 17ఏళ్లు పూర్తి చేసుకుంది. లవ్‌ స్టోరీస్‌ చిత్రాల్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమాకి సంబంధించిన అనేక పారామీటర్స్ ని మార్చేసింది. ముఖ్యంగా ప్రేమ కథల్లో ఓ సరికొత్త పంథాని రుచి చూపించిన చిత్రమిది. బన్నీ కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌ ఇచ్చిన సినిమా ఇది. అలాగే దర్శకుడు సుకుమార్‌ని దర్శకుడిగా నిలిబెట్టిన చిత్రమిది. ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌కి మరో నెక్ట్స్ లెవల్‌ లైఫ్‌నిచ్చింది. దీంతోపాటు కెమెరామెన్‌, డిస్టిబ్యూటర్స్, ఇతర ఆర్టిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల ఇలా అనేక మంది లైఫ్‌నే మార్చేసింది. 

ఈ సినిమా 17ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్‌ స్పందించారు. ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. `ఈ సినిమా చాలా మంది జీవితాలను మార్చేసింది. నటుడిగా నా కెరీర్‌ని మార్చింది. దర్శకుడిగా సుకుమార్‌కి లైఫ్‌ ఇచ్చింది. నిర్మాతగా దిల్‌రాజుకి లైఫ్‌ ఇచ్చింది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కి లైఫ్‌ ఇచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్‌గా బన్నీవాసుకి, ఇలా ఎంతో మందికి లైఫ్‌ ఇవ్వడంతోపాటు వారి జీవితాలను మార్చేసింది. అందుకు కారణం `ఆర్య` అనే ఒక్క మ్యాజిక్‌ మా జీవితంలోకి రావడమే. ఇది ఎప్పటికీ మా జీవితంలో గొప్ప మైల్‌స్టోన్‌ చిత్రమవుతుంది` అని పేర్కొన్నారు. 

ఇది మాకు లైఫ్‌ ఛేంజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్ చిత్రం. 17ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ, దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సుకుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్‌. అయితే ఆయన మరోసారి ఈ సినిమాని చూశారు. ప్రస్తుతం బన్నీ కరోనా సోకడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సినిమాని చూస్తున్నానని తెలిపారు. ఈ మేరకు
ఆయన చిన్న వీడియో క్లిప్‌ని పంచుకున్నారు.