`పుష్ప` సినిమా గురించి హీరో అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకి బూస్ట్ ఇచ్చారు. రేపు థియేటర్లో `పుష్ప` సినిమా చూస్తే ఆడియెన్స్ కి పిచ్చెక్కిపోతుందన్నారు. 

`పుష్ప` సినిమా చూశాక దర్శకులంతా సుకుమార్‌ వద్ద క్లాసులు తీసుకుంటారని, ప్రతి సీన్‌ గురించి మాట్లాడతారని, ప్రతీ సీన్‌ గురించి తెలుసుకుంటారని అంటున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటించిన చిత్రం `పుష్ప`. ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో సుకుమార్ తో సహా టీమ్‌ అందరు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా `పుష్ప` సినిమా గురించి హీరో అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకి బూస్ట్ ఇచ్చారు. రేపు థియేటర్లో `పుష్ప` సినిమా చూస్తే ఆడియెన్స్ కి పిచ్చెక్కిపోతుందన్నారు. కమర్షియల్‌గా ఓ సినిమాని ఇలా కూడా తీయోచ్చని అనిపిస్తుంది. మ్యాజిక్‌ వర్కౌట్‌ అయితే సినిమా వేరేలెవల్‌లో ఉంటుంది. ఈ సినిమా చూశాక ఇండస్ట్రీలోని దర్శకులంతా సుకుమార్‌ వద్ద క్లాసులు తీసుకుంటారు. ప్రతి సీన్‌ గురించి మాట్లాడాతారు. ఆయా సీన్లు ఎలా తీశారో తెలుసుకుంటారు. అంత బాగా చేశారు` అని తెలిపారు. 

ఇంకా చెబుతూ, కమర్షియల్‌ సినిమానా, నటనకు స్కోప్‌ ఉన్న సినిమానా? అంటే నటనకు స్కోప్‌ ఉన్న సినిమాకి మించిన కమర్షియల్‌ సినిమా మరోకటి లేదు. నేను `పుష్ప` చేసేటప్పుడు ఆ పాత్రతో ట్రిప్‌ అయిపోయాను. నేనే కాదు దర్శకుడు సుకుమార్‌ కూడా ట్రిప్‌ అయిపోయాడు. అందరం కలిసి ఓ వండర్‌ఫుల్‌ సినిమాని చేశా`మని తెలిపారు బన్నీ. ఈ సినిమా చేసేటప్పుడు తనకు మంచి హిట్‌ కావాలి, మంచి పేరు రావాలి, డిసెంబర్ 17కి సినిమా ఇవ్వాలని సుకుమార్తో అన్నాను. ఆయన అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. ఫైనల్‌గా సినిమానిచ్చాడు` అని చెప్పారు బన్నీ. 

`ఒక హీరోని దర్శకుడు ప్రేమిస్తే సినిమా ఎలా ఉంటుందనేది చెప్పడానికి నిదర్శనం `పుష్ప`. ఈ చిత్రం నా కెరీర్‌లో ఒక సినిమా కాదు, సుకుమార్‌ నాపై చూపించిన ప్రేమకి నిదర్శనం. ఒక నటుడిగా నాకు ఇంతకంటే ప్రేమ దొరుకుతుందా` అని అన్నారు. `పుష్ప`కి సౌత్‌ ఇండస్ట్రీనుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందన్నారు. తమిళం, కన్నడ, మలయాళం ఇలా సౌత్‌ భాషల వారు కూడా దీన్ని ఓన్‌ చేసుకున్నారు. ప్రేమించి ప్రమోట్‌ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా` అని అన్నారు బన్నీ. 

ఫ్యాన్స్ మీట్‌ గురించి చెబుతూ.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఐదారు వేల మందివస్తానుకుంటే పది వేల మందికిపైగా వచ్చారు. అక్కడ సరిగ్గా కలవలేకపోయాను. ఆ తర్వాత నా ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా కలవాలనుకున్నాం. ఓ ఐదు వందల మందిని కలవాలని ఫ్యాన్స్ మీట్‌ ఏర్పాటు చేశాం. కానీ అక్కడికి నాలుగు వేల మంది వచ్చారు. అక్కడ గేట్లని విరిగిపోయాయి. గందరగోళం కావడంతో ఆ మీట్‌ని క్యాన్సిల్‌ చేశాం. ఆ తర్వాత మళ్లీ అభిమానులను కలుస్తాను. మేము మేము ఎప్పుడైనా కలుసుకుంటాం. వాళ్లు అభిమానులు కాదు అల్లు అర్జున్‌ ఆర్మీ అని తెలిపారు బన్నీ. ఈ సందర్భంగా రష్మిక మందన్నాపై ప్రశంసలు కురిపించారు. సరైన పాత్ర, సరైనా డైరెక్టర్‌ పడితే తనేంటో నిరూపిస్తుందని, ఆమె అన్‌బిలీవబుల్‌ యాక్టర్‌ అని, ఇలా చెబితే అలా చేసేస్తుందన్నారు.