స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మొదటి నుండి కూడా ఇతర హీరోలతో పోలిస్తే తను ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. తను వాడే ప్రాపర్టీస్ అన్నీ కూడా స్టైలిష్ గా ఉండేలా చేసుకుంటాడు.

ముఖ్యంగా అతడి కార్ వ్యాన్ ని ముంబైకి చెందిన ఓ వ్యక్తితో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడట.మూడు కోట్లు పెట్టి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకోగా.. ఈ వ్యాన్ ధర రూ.7 కోట్లకు పైమాటే అంటున్నారు. ఇంత లగ్జరీ కార్ వ్యాన్ ని దేశంలో ఏ హీరో వాడడం లేదని అంటున్నారు.

సినిమా సెట్ లో ఈ కార్ వ్యాన్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఫ్లాప్ కావడంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సుశాంత్, నివేతా పెతురాజ్, టబు వంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.